144 ఏండ్ల క్రికెట్ చరిత్రలో ఎవరూ నమోదు చేయని అరుదైన రికార్డును వెస్టిండీస్ డెబ్యూ ఆటగాడు కేల్ మేయర్స్ నమోదు చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో ఐసీసీ తన ట్విట్టర్ వేదికగా మేయర్స్ ను ప్రశంసించింది. టీమిండియా దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సైతం మేయర్స్ పై ప్రశంసలు కురిపించాడు. ‘నమ్మలేకపోతున్నాను.. నేను చూసిన ఛేజింగ్ లలో ఇదోకటి’ అంటూ ట్వీటాడు.
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. డెబ్యూ ఆటగాడు కేల్ మేయర్స్ 310 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 210 పరుగులు చేయడంతో 395 పరుగుల భారీ లక్ష్యాన్నివిండీస్ సులువుగా ఛేదించింది. అద్భుత విజయాన్ని అందించిన మేయర్స్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 430 పరుగుల చేసిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్ లో 223 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి విండీస్ ముందు 395 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.