ఆస్ట్రేలియా గడ్డపై అజింక్య రహానే కెప్టెన్సీలో భారత్ సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రహానేకు పూర్తిస్థాయి కెప్టెన్సీ ఇవ్వాలని సోషల్ మీడియాలో జోరుగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలపై రహానే స్పందించాడు. ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ కు విరాట్ కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని స్పష్టం చేశాడు. కోహ్లీ లేనప్పుడు మాత్రమే తాను కెప్టెన్ గా ఉంటానన్నాడు. జట్టు సమిష్టి కృషితోనే ఆస్ట్రేలియాలో విజయాలను సాధించామన్నాడు.