ఇండియన్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి రికార్డులను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ బ్రేక్ చేశాడు. సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. స్మిత్‌కు టెస్టుల్లో ఇది 27వ సెంచరీ. టెస్ట్ క్రికెట్లో 27 సెంచరీల మార్క్‌ను 136వ ఇన్నింగ్స్‌లోనే సాధించి అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్లలో స్మిత్ రెండోస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ 70 ఇన్నింగ్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లి, సచిన్ ఇద్దరూ 141వ ఇన్నింగ్స్‌లో 27వ సెంచరీ చేశారు. దీంతోపాటు టెస్టుల్లో కోహ్లి పరుగుల (7318)ను కూడా ఈ ఇన్నింగ్స్‌తో స్మిత్(7368) అధిగమించాడు.