20.4 C
Hyderabad
Sunday, January 24, 2021

MIvsRR: ముంబై ‘హ్యాట్రిక్’ విక్టరీఐపీఎల్‌-13 లో ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ టీం.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆదరగొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సూపర్‌ పర్ఫామెన్స్‌తో 57 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 136 పరుగులకే కూప్పకూలింది. ముంబై బౌలర్లు బుమ్రా 4 వికెట్లు, బోల్ట్‌, పాటిన్సన్‌ తలో రెండు వికెట్లు తీసి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు.

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆది నుంచే ఓపెనర్లు రోహిత్‌ శర్మ, డికాక్‌ జోడి ముంబై జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరు కలిసి మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. 5వ ఓవర్‌లో డికాక్‌ ఔట్‌ కావడంతో.. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య 12 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో  సూర్యకుమార్ బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌ 2 వికెట్లు తీశాడు.

అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌.. ముంబై బౌలర్ల ధాటికి 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే  ఓపెనర్‌ జైశ్వాల్ డకౌట్‌ అయ్యాడు. స్పీడ్‌స్టర్‌ బుమ్రా వేసిన తర్వాతి ఓవర్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 6 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఆరంభం నుంచే వికెట్ల పతనం సాగడంతో కోలుకోవడం కష్టమైంది. పవర్‌ప్లే ముగిసేసరికే  స్టార్‌ బ్యాట్స్‌మెన్‌  పెవిలియన్‌ చేరడంతో  లక్ష్య ఛేదనలో చేతులెత్తేసింది.  వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ బట్లర్‌ మాత్రం  బౌలర్లను  లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో హోరెత్తించాడు. ఒంటరిగా పోరాడుతున్న  బట్లర్‌ను  14వ ఓవర్‌లో పాటిన్సన్‌  ఔట్‌ చేయడంతో రాజస్థాన్‌ ఓటమి ఖాయమైంది.18.1 ఓవర్లలో 136 పరుగులే చేసి రాజస్థాన్‌ ఆలౌటైంది. ముంబయి బౌలర్లలో బుమ్రా  4 వికెట్లు, బౌల్ట్‌ ప్యాటిన్సన్‌ చెరో రెండు వికెట్లు తీశారు..

సూపర్ బ్యాటింగ్ తో ముంబై భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో  ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది…  

- Advertisement -

Latest news

Related news

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...