ఆస్ట్రేలియా టూర్లో అదరగొట్టిన హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సిరాజ్ కు అభిమానులు ఘనంగా స్వాగతం చెప్పారు.
దాదాపు 63 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉన్న సిరాజ్.. నేరుగా ఎయిర్ పోర్టు నుంచి ఖైరతాబాద్ గ్రేవ్ యార్డుకు పోయాడు. తన తండ్రి మహమ్మద్ గౌస్ సమాధి ముందు ప్రేయర్ చేశాడు. ఆస్ట్రేలియా టూర్లో ఉండగానే సిరాజ్ తండ్రి నవంబర్ 20న మరణించిన విషయం తెలసిందే.
ఆస్ట్రేలియాతో గబ్బా పిచ్‌పై జరిగిన చివరి టెస్టులో 6 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలకప్రాత పోషించాడు. టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్ అత్యధికంగా 13 వికెట్లు తీశాడు.
టీమిండియా సభ్యులు కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వి షా గురువారం తెల్లవారుజామున ముంబైకి చేరుకున్నారు. అటు బ్రిస్బేన్ టెస్ట్ హీరో రిషబ్ పంత్ కూడా ఢిల్లీలో అడుగుపెట్టాడు.