టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై మరోసారి కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో జరగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా, దాంతోపాటు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సిడ్నీలో జరిగిని మూడో టెస్టులో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్, బుమ్రాపై ఆస్ట్రేలియన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.