పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ 10 వికెట్లు తీయడంతో పాకిస్థాన్ 2-0తో సౌతాఫ్రికాపై సిరీస్ విజయం సాధించింది. 2003 తర్వాత సౌతాఫ్రికాపై పాక్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్టులో 370 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా షహీన్ అఫ్రిది (4/51), హసన్ అలీ (5/60) దెబ్బకు 274 పరుగులకే ఆలౌటైంది. దీంతో 95 పరుగులతో పాకిస్థాన్ విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్ ని కైవసం చేసుకుంది. సౌతాఫ్రికా ఓపెనర్ మర్క్రామ్ (108) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. చివరి 7 వికెట్లను కేవలం 33 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఈ విజయంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో పాక్ ఐదో స్థానానికి చేరుకుంది.
స్కోర్లు..
సౌతాఫ్రికా 274/10, 201/10
పాకిస్థాన్ 272/10, 298/10