టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనీకి చెందిన ఓ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు కొట్టిన ఆటగాడిగా కొత్త రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పంత్ (89 నాటౌట్) చేసిన విషయం తెలిసిందే. కేవలం 27 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ధోనీ 32 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. తర్వాతి స్థానాల్లో ఫరూక్ ఇంజినీర్ (36), వృద్ధిమాన్ సాహా (37), నయన్ మోంగియా (39) ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన పంత్ 2 సెంచరీలు, 4 హాప్ సెంచరీలు కొట్టాడు.