29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సొంతరాష్ట్రానికి పంత్ సాయం

ఉత్తరాఖండ్ లో జరిగిన విపత్తు దేశమంతటినీ కదిలించింది. ఈ సందర్భంగా సహాయ చర్యల కోసం తన మ్యాచ్ ఫీజునే విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని రిషబ్ ప్రకటించారు.
రిషబ్ పంత్.. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన విపత్తును చూసి విచారం వ్యక్తం చేస్తూ పంత్ ఆదివారం ట్వీట్ చేశారు. వరదలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారికోసం తన మ్యాచ్ ఫీజుని విరాళంగా ప్రకటిస్తూ.. బాధితులను ఆదుకునేందుకు మరింతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ‘ఎ’ గ్రేడ్ ప్లేయర్ గా ఉన్న పంత్ కు.. మ్యాచ్ కు సుమారు మూడు నుంచి ఐదు లక్షల ఆదాయం వస్తుంది.

- Advertisement -

Latest news

Related news