29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సచిన్ ట్వీట్ పై.. ప్రముఖుల ఆగ్రహం

సాగు చట్టాలపై రైతులు చేస్తున్న పోరాటానికి.. అంతర్జాతీయంగా పెద్దపెద్దోళ్లు మద్దతు తెల్పిన విషయం తెలిసిందే. వాళ్లట్ల ట్వీట్లు చెయ్యంగనె.. మా దేశంల పంచాయితీ.. మేం చూసుకుంటం.. మీకెందుకు అని సచిన్ టెండుల్కర్ ట్విట్టర్ల ఓ ట్వీట్ పెట్టిన ముచ్చట మనందరికీ తెల్శిందే. అయితే.. సచిన్ పెట్టిన ట్వీట్ శానమందికి నచ్చలేదు. ఇన్నిరోజులు రైతులు పోరాటం చేస్తుంటే.. ఒక్కనాడు కూడ వాళ్ల తరపున ఒక్కమాట మాట్లాడని సచిన్.. ఇయ్యాల దేశ అంతర్గత విషయాల అనుకుంట.. ట్వీట్ పెట్టుడు ఏం మంచిగ లేదు అని బనాయించుడు మొదలుపెట్టిర్రు.
సోషల్ మీడియాలో .. నీ తీరు కరెక్టు లేదు సచినూ.. అంటూ పోస్టులు పెడుతున్నరు. రైతుల పక్షాన నిలవడాల్సింది పోయి.. సర్కారుకు మద్దతు పల్కుతవా? అని కోపమయిండ్రు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అయితే.. సచిన్ కామెంట్ల మీద ఘాటుగ స్పందించిర్రు. దేశప్రజలు సెలబ్రిటీల తీరు గురించి మాట్లాడుకుంటున్నరని.. మంచేదో, చెడేదో తెల్సుకొని స్పందిస్తే మంచిగుంటదని సుర్కులు పెట్టినట్టు మాట్లాడిండు. ముంబై రాజ్ థాక్రే కూడా.. సచిన్ పోస్టులను తప్పు పట్టిండు.
సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది తప్పే అన్నరు. సచిన్‌ టెండూల్కర్, లతా మంగేష్కర్‌ల ప్రతిష్టను కేంద్ర ప్రభుత్వం స్వార్థానికి వాడుకోవాలనుకున్నదని రాజ్ థాక్రే కోపమయిండు. వారితో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించకుండా ఉండేదుండె అని అభిప్రాయపడ్డరు. రైతుల పోరాటానికి మద్దతుగా ఇంటర్నేషనల్ సింగర్ రిహానా పోస్టు పెట్టినపుడు ఆమె గురించి శానమంది ఇండియన్స్ కి తెల్వదని.. అంతటితో వదిలేస్తే బాగుండేదని.. కావాలని కేంద్ర ప్రభుత్వం భారత సెలబ్రిటీలతో ట్వీట్లు, పోస్టులు పెట్టించి.. విషయాన్ని ఇంకా పెద్దది చేసిందని విమర్శించారు. రిహానా, గ్రెటా థన్‌బెర్గ్‌లను భారత్‌ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దనిర మాట్లాడుతున్న కేంద్రం.. అమెరికాలో ట్రంప్ మద్దతు ర్యాలీకి ఎందుకు సపోర్ట్ చేశిందని ప్రశ్నించిండు రాజ్ థాక్రే.

- Advertisement -

Latest news

Related news