‘క్వారంటైన్లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె షేర్ చేసింది.
మరో వారం రోజుల్లో చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఆరు రోజుల పాటు ఓ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. కుటుంబసభ్యులను వెంట తెచ్చుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇయ్యడంతో ఆటగాళ్లు క్వారంటైన్లో ఫ్యామిలీలతో సరదాగా గడుపుతున్నారు.