29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఇంగ్లాండ్ సిరీస్ లో విరాట్ ముందున్న రికార్డులు

ఆస్త్రేలియాపై విజయాలతో ఊపుమీదున్న టీంఇండియా ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్  సిరీస్ లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ సిరీస్ లో అందరిచూపు టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్టు సిరీస్ లో కోహ్లీ కొన్ని అరుదైన రికార్డులను నెలకొల్పే అవకాశం ఉండటమే కారణం. ఆ రికార్డుల ఏంటో ఓ సారి చుద్దామా…

ఇంగ్లాండ్ పై అత్యధిక రన్స్

స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఇండియన్ ప్లేయర్ గా నిలిచేందుకు కోహ్లీ 489, పుజారా 493 పరుగుల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ రికార్డు క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌ పేరిట ఉంది. ఇంగ్లండ్‌పై స్వదేశంలో గవాస్కర్‌  22 టెస్టులు ఆడి 1331 పరుగులు చేశాడు.

అత్యధిక విజయాల సారథి

స్వదేశంలో అత్యధిక విజయాలు అధించిన కెప్టెన్‌గా నిలిచేందుకు కోహ్లీ ఇంగ్లండ్‌ సిరీస్‌లో మరో రెండు విజయాలను సాధిస్తే ధోనీ పేరిట ఉన్నరికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం ధోనీ 21 విజయాలు, కోహ్లీ 20 విజయాలతో ఉన్నారు.

కెప్టెన్ హోదాలో అత్యధిక రన్స్

ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్టుల్లో మరో 14 పరుగులు సాధిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో కెప్టెన్‌గా కోహ్లీ నిలుస్తాడు. కోహ్లీ కెప్టెన్ హోదాలో ఇప్పటికే  5,220 రన్స్ చేశాడు. గ్రేమ్‌స్మిత్‌(8,659), అలెన్‌ బోర్డర్‌ (6,623), రికీపాంటింగ్‌ (6,542), క్లైవ్‌లాయిడ్‌(5,233) కొహ్లీ కంటే ముందున్నారు.

స్వదేశంలో కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు

కోహ్లీ మరో రెండు సెంచరీ కొడితే స్వదేశంలో అత్యధిక శతకాలు సాధించిన టెస్టు కెప్టెన్‌గా నిలుస్తాడు. స్వదేశంలో కెప్టెన్ హోదాలో కోహ్లీ 26 టెస్టుల్లో 10 సెంచరీలు చేశాడు. ఆసీస్‌లో రికీ పాంటింగ్ కెప్టెన్‌గా 39 మ్యాచ్‌ల్లో 11 శతకాలు సాధించి కోహ్లీ కంటే ముందున్నాడు.

- Advertisement -

Latest news

Related news