ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. 84 ఏండ్ల తర్వాత హ్యాట్రిక్ 150+ స్కోర్లతో అరుదైన మైలురాయి అందుకున్న మొదటి కెప్టెన్‌గా రూట్ నిలిచారు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు శ్రీలంక పర్యటనలో వరుసగా 228, 186 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా లెజండరీ బ్యాట్స్ మన్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ 1937లో వరుసగా 150+ రన్స్ చేసి ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు.