బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ రూ.5కోట్ల బోనస్ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రెటరీ జేయ్ షాలు ట్వీటారు.
‘ఇదో అద్భుత విజయం. ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ టెస్ట్ సిరీస్ను గెలవడం అపూర్వం. ’ అని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ట్వీటారు. సిరీస్లో పాల్గొన్న భారత జట్టుకు 5 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నట్లు తన ట్వీట్లో గంగూలీ చెప్పారు. గబ్బా టెస్టులో 3 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.