23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

5 వికెట్ల అరుదైన క్లబ్ లో సిరాజ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెడో ఇన్నింగ్స్ లో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు సాధించి అరుదైన క్లబ్ లో స్థానం పొందాడు. ఆడిన తొలి టెస్ట్ సిరీస్‌లోనే ఐదు వికెట్ల ఘ‌న‌తను సాధించాడు. దాంతోపాటు  గ‌బ్బా స్టేడియంలో ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఐదో ఇండియ‌న్ బౌల‌ర్‌గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ కంటే ముందు ఎరాప‌ల్లి ప్రస‌న్న‌, బిష‌న్ సింగ్ బేడీ, మ‌ద‌న్ లాల్‌, జ‌హీర్ ఖాన్ మాత్రమే ఈ ఘ‌న‌త సాధించారు.  ఈ సిరీస్ లో మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసిన సిరాజ్‌.. అశ్విన్ (12)ని వెన‌క్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు. గాయాల‌తో స్టార్ బౌల‌ర్లు బుమ్రా, ష‌మి, ఉమేష్ దూర‌మైన వేళ‌ తనకొచ్చిన అవకాశాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

- Advertisement -

Latest news

Related news