ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మహమ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. సిరాజ్ ఎమోషల్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
సిరాజ్ తండ్రి గౌస్ (53) కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు బీసీసీఐ సిరాజ్కు అవకాశం ఇచ్చింది. కాని తొలిసారి భారత టెస్ట్ జట్టుకు ఆడే అవకాశం దక్కడంతో పాటు క్వారంటైన్ నిబంధనల కారణంగా తాను స్వదేశానికి వెళ్ళేందుకు అంగీకరించలేదు. తండ్రి మృతి చెందాడనే బాధను దిగమింగుకొని తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తాను ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లో(2/40 , 3/37) ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.