గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గతంలో గుండెలో స్టంట్ వేయించుకున్న దాదా.. ఇంట్లో వర్కవుట్స్ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్ కు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. తాజాగా వారం క్రితం మరోసారి గుండెలో నొప్పి రావడంతో గంగూలీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ దేవిశెట్టి, అశ్విన్ మెహతాలతో కూడిన టీమ్ గంగూలీకి వైద్యం అందించారు. గురువారం నాడు యాంజియోప్లాస్టీ చేసి.. దాదాకు రెండు స్టెంట్లు వేశారు. ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉన్నందున ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.