21.7 C
Hyderabad
Friday, January 22, 2021

సిడ్నీ టెస్టు డ్రా.. కానీ పోరాట పటిమ అద్భుతం

బార్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగిన మూడో టెస్టులో ఇండియా టీం డ్రా చేసుకున్న ప్రతి భారతీయుడు గుండెల్లో విజయం సాధించింది. తమ అసాధారణ పోరాట పటిమతో అందరి మన్ననలు పొందారు. దాదాపుగా ఓటమి ఖాయమనుకున్న స్థితిలో పోరాడి నిలిచింది. 131 ఓవర్లపాటు ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొవడం అంటే మాటలు కాదు. 2015లో సిడ్నీలోనే ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో భార‌త్ త‌న రెండ‌వ ఇన్నింగ్స్‌లో 89.2 ఓవ‌ర్లు ఆడి ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకున్న‌ది. రెండ‌వ ఇన్నింగ్స్‌లో భార‌త్ 131 ఓవ‌ర్లు ఆడి మ్యాచ్‌ను డ్రా చేయ‌డం ఇదే మొద‌టిసారి కావడం గమనార్హం.

రిష‌బ్ పంత్(97) అటాకింగ్ ఇన్నింగ్స్‌కు తోడు.. పుజారా(77), విహారి(23 నాటౌట్‌), అశ్విన్(39 నాటౌట్‌) ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాయి. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ కంగారూ బౌల‌ర్లు చెమ‌టోడ్చినా ఫ‌లితం లేకుండా పోయింది. విహారి, అశ్విన్ చెక్కు చెద‌ర‌ని ఏకాగ్ర‌త‌, దృఢ‌సంక‌ల్పం ముందు ఆసీస్ బౌల‌ర్లు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఈ ఇద్ద‌రూ ఆరో వికెట్‌కు 258 బంతులాడి 62 ప‌రుగులు జోడించ‌డం విశేషం. మ్యాచ్ డ్రాగా ముగిసే స‌మ‌యానికి టీమిండియా 5 వికెట్ల‌కు 334 ప‌రుగులు చేసింది. ఈ డ్రాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో రెండు టీమ్స్ స‌మ‌వుజ్జీలుగా ఉన్నాయి.

కొన్ని రికార్డులు..
హ‌నుమా విహారీ 161 బంతులు ఆడి 23 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. టెస్టు చ‌రిత్ర‌లో ఇంత నిదానంగా ఆడిన తొమ్మిదో ఇన్నింగ్స్ ఇది. అంతకుముందు . 2015లో ఢిల్లీలో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో 244 బంతుల్లో అత‌ను 25 ర‌న్స్ చేశాడు.

ఆస్ట్రేలియాపై సునీల్ గ‌వాస్క‌ర్ తర్వాత స్టో స్ట్రయిక్ రేటు నమోదు చేసింది చ‌తేశ్వ‌ర్ పుజారానే. అత‌ను చేసింది 77 ప‌రుగులే కానీ ఆ ఇన్నింగ్స్ కోసం సుమారు 200 బంతుల‌కు పైగా ఆడాడు.

1964లో సౌతాఫ్రికా కూడా ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు 117 ఓవ‌ర్లు ఆడింది. ఆ రికార్డును ఇండియా చెరిపేసింది. సిడ్నీ టెస్టు డ్రా చేసుకునేందుకు ఇండియా టీం 786 బంతులు ఆడింది.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...