ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ ఇశాంత్ శర్మ జట్టులోకి తిరిగి వచ్చారు. వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్ధిమాన్ సహా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్రిస్బేన్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్‌కు జట్టులో స్థానం లభించింది. ఆస్ట్రేలియా పర్యటనలో 13 వికెట్లు కూల్చిన హైదరాబాదీ మొహ్మద్ సిరాజ్ సైతం స్వదేశంలో జరిగే టోర్నీఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు ఇండియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, టీ-20 మ్యాచులు ఆడనుంది.
తొలి రెండు టెస్టులకు..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ సుందర్, ఆక్సర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.