29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఐపీయల్‌కు ధీటుగా.. ఎమిరేట్స్ లీగ్..

మన ఐపీయల్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మెగా టోర్నీలో ఆడాలని అన్ని దేశాల క్రికెటర్లు కోరుకుంటారు. అంతగా సూపర్ హిట్ అయిన ఐపీయల్ ను మోడల్ గా తీసుకుని.. చాలా దేశాలు ప్రీమియర్ లీగ్ లు మొదలుపెట్టాయి. కానీ ఐపీయల్ ను మించిన స్థాయిలో ఏ లీగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఐపీయల్ ను తలదన్నేలా యూఏఈ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించనుంది.
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండియా సహా క్రికెట్ ఆడే చాలా దేశాలు స్వాగతించాయని ఈసీబీ చెప్పింది. తొలుత ఆరు జట్లతో టీ20 లీగ్‌ను ప్రారంభించాలని ఈసీబీ నిర్ణయించింది. మరో నెల రోజుల్లో వాటాదారులను నిర్ణయించనున్నట్టు ఈసీబీ అధికారులు తెలిపారు. ఈ లీగ్ లో ఆటగాళ్ల వేతనం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగుల్లో ఒకటిగా దీనిని తీర్చిదిద్దుతామని అన్నారు. మరి ఈ లీగ్ ఐపీయల్ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.. ఐపీయల్ ను తలదన్నేలా ఉంటుందో వేచి చూడాలి.

- Advertisement -

Latest news

Related news