క్రికెట్ లో బౌలింగ్ చేసే విషయంలో ఒక్కోక్క బౌలర్ది ఒక్కో స్టైల్. తాజాగా ఓ బౌలర్ వెరైటీగా బాల్ వేసాడు. బాల్ కంటే ముందే బౌలరే గిరగిర తిరుగడం ఈ బౌలర్ స్పెషల్. అతని బౌలింగ్ స్టైల్ సరిగ్గా భారత నాట్యం భంగిమలా ఉంది. ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల వ్యూస్ రాగా.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు నెటిజన్లు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో ‘భారత నాట్యం స్టైల్ ఆఫ్ స్పిన్’ షేర్ చేశారు. దీనిని హర్బజన్ సింగ్కు ట్యాగ్ చేస్తూ.. ఏమంటావ్ హర్బజన్ ? అని పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోలో ఉన్న బౌలర్ ఎవరు ? ఈ వీడియో ఎక్కడ తీశారు అన్నదానిపై స్పష్టత లేదు.