29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

భావోద్వేగం ఆపుకోలేక ఏడ్చేశాను..

32 ఏండ్లుగా ఓట‌మే ఎరుగ‌ని గ‌బ్బాలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్‌ను గెల‌వ‌డాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి ప్ర‌తి క్రికెట్ అభిమాని గ‌ర్వంతో ఉప్పొంగిపోతారు. హైద‌రాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మ‌న్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ కూడా దీనికి అతీత‌మేమీ కాదని చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అప్పటి తన అనుభవాలను పంచుకున్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ లో టీమిండియా గెలిచి సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యానని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు. ఓ సందర్భంగా భావోద్వేగం ఆపుకోలేక కంట‌త‌డి పెట్టిన‌ట్లు ల‌క్ష్మ‌ణ్‌ చెప్పాడు. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన‌ప్పుడు కూడా ఏడ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో క్రికెట్ చూస్తూ ఈ రెండు సార్లు మాత్రమే కంటతడి పెట్టినట్టు లక్ష్మణ్ వివరించాడు.  

‘పంత్‌, వాషింగ్ట‌న్ సుందర్ ఆడే స‌మ‌యంలో చాలా ఆందోళ‌న‌కు గురయ్యాను. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై గెలవాల‌న్న‌ది నా క‌ల‌. ఓ క్రికెట‌ర్‌గా అది నాకు తీర‌ని కోరిక‌. కానీ కుర్రాళ్లతో కూడిని టీమిండియా చేసి చూపింది. అది మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతి.’ అని ల‌క్ష్మ‌ణ్ వివరించాడు.

- Advertisement -

Latest news

Related news