ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో రెండో వేగవంతమైన సెంచరీ కొట్టిన కేరళకు చెందిన యువ బ్యాట్స్ మెన్ మహ్మద్ అజహరుద్దీన్ పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘‘వావ్ అజహరుద్దీన్. గొప్ప ఇన్నింగ్స్ ఆడావ్. గ్రేట్. ముంబయి లాంటి టీంపై ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం సాధారణ విషయం కాదు. నీ బ్యాంటింగ్ ను ఆస్వాదించాను” అని టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
బుధవారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో అజహరుద్దీన్ 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 54 బంతులాడి 137 రన్స్(9 ఫోర్లు, 11 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా తన జట్టుకు విజయాన్ని అందించాడు.