25.6 C
Hyderabad
Saturday, January 16, 2021

ఎవరైనా 800 వికెట్ల మార్క్‌ చేరుకుంటారా?

శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌.  2010లో ఇండియాతో తన కెరీర్ చివరి మ్యాచ్ లో ఓజాను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

గత పదేండ్లలో ఈ స్పిన్ దిగ్గజం దరిదాపుల్లోకి మరే బౌలర్ రాలేదు. ముత్తయ్య తర్వాత షేన్ వార్న్(ఆస్ట్రేలియా-708 వికెట్లు),  అనిల్ కుంబ్లే(ఇండియా-619 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్-589 వికెట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఎవరైనా 800 వికెట్ల మార్క్‌ చేరుకుంటారా? అని ఓ మీడియా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మురళీధరన్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తన తర్వాత టెస్టుల్లో  800 వికెట్ల మైలురాయిని అందుకునే సత్తా ఇండియన్ స్పిన్నర్ రవిశంద్రన్ అశ్విన్(377 వికెట్లు)కే ఉందన్నాడు. ఆసిస్ స్పిన్నర్ నాథన్ లయన్(396 వికెట్లు) ఉన్నా.. అతడు ఇప్పటికే చాలా మ్యాచ్ లు అడేశాడన్నాడు.  వీళ్లు కాకుండా మరే బౌలర్‌ కూడా 800 వికెట్ల మార్క్‌ వరకు వెళ్తాడని అనుకోవట్లేదని ముత్తయ్య విశ్లేషించాడు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...