18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

అందరికీ అనుకూలంగా కొత్త సెక్రటేరియట్‌

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగగా పలు మార్పులను సీఎం సూచించారు. కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్,  ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎంఓ అధికారులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, అధికారులు సతీష్, మధుసూదన్ రెడ్డి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, అర్కిటెక్స్ట్ నిపుణులు ఆస్కార్-పొన్ని హాజరయ్యారు.

సెక్రటేరియట్ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండాలని సీఎం సూచించారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్ కూడా ఉండాలన్నారు. అటు అన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం ఉండాలని సీఎం సూచించారు. 

పాత సచివాలయం ఎన్నో లోపాలతో కూడుకొని ఉండడంతో దాన్ని కూల్చివేసి అదే స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పాత భవనం కూల్చివేత పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. పాత భవనం శిథిలాల తొలగింపు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...