22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎస్సార్‌డీపీలో భాగంగా రెండు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేష్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

రూ.350 కోట్లతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి, రెండో దశలో రూ.76 కోట్లతో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగపల్లి వరకు మూడు లేన్ల వంతెన నిర్మిస్తామని తెలిపారు. రూ.6 వేల కోట్లతో ఎస్సార్‌డీపీ పనులు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైరదాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తిచేస్తామని చెప్పారు. రూ.5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తిచేస్తామన్నారు. 18 కి.మీ. చొప్పున రెండు ఎలివేటెడ్‌ కారిడార్లు ప్రతిపాదించామని తెలిపారు. రక్షణ రంగ భూములు ఇచ్చేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషిచేయాలన్నారు.

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...