తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చిరు కానుకగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి ప్రతీ గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈసారి మహిళా సంఘాల సభ్యులే చీరలను పంపిణీ చేస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న దీర్ఘ కాలిక చర్యల ద్వారా రాష్ట్రంలో రైతులు, నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.