25.3 C
Hyderabad
Wednesday, June 3, 2020

అర్థంలేని కేంద్రం విధానాలు

కరోనా కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. రాష్ర్టాల ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. ఈ సమయంలో రాష్ర్టాలకు అండగా నిలవాల్సిన కేంద్రప్రభుత్వం మాత్రం.. తలాతోకాలేని నిర్ణయాలతో మరింత సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. గతంలో 1991,1997, 2008లో దేశం సాధారణ ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు తీసుకున్నపాటి రక్షణచర్యలు కూడా ప్రస్తుత మోడీ సర్కారు తీసుకోకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించినా.. అందులో ప్రజలను, రాష్ర్టాలను నేరుగా ఆదుకొనే చర్యలేవీలేవు. అప్పులు తీసుకోండి.. తిప్పలు పడండి అన్నట్టుగానే కేంద్ర ప్యాకేజీ ఉన్నది. ఉపాధిలేక ప్రజలు అసలే కష్టాల్లో ఉన్న సమయంలో వారిపై మరిన్ని పన్నులు వేయండి.. అప్పుడే ఎఫ్‌ఆర్‌బీఎం పెంచుతాం అని కండిషన్‌ పెట్టడం తలతిక్క చర్యేనని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. ఈ సంక్షోభాన్ని ముందుగానే అంచనావేసిన సీఎం కేసీఆర్‌ ఆర్థికరంగాన్ని గాడిన పెట్టడానికి క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ మనీ విధానాన్ని అమలుపరచాలని, హెలికాప్టర్‌ మనీ అస్ర్తాన్ని ప్రయోగించాలని సూచించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లు రఘరామరాజన్‌, దువ్వూరి సుబ్బారావు, ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ లాంటివారు ఇవే సూచనలు చేశారు. కానీ కేంద్రం అలాంటి దిశగా చర్యలేవీ తీసుకోలేదు.

2024 నాటికి భారతదేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అది సాధ్యంకావాలంటే దేశంలో ఆర్థిక సంస్కరణల వేగం పెరగాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. వాణిజ్య సరళీకరణ వేగం పెరగాలి. ఇవన్నీ కేంద్రం రాష్ర్టాలకు నిర్దేశించిన లక్ష్యాలు. ఈ లక్ష్యాల అమలులో తెలంగాణ దేశంలో అన్ని రాష్ర్టాల కంటే ముందున్నది. 2017-18లో దేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాల నుంచే సగానికిపైగా ఉన్నది. కానీ కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఈ రాష్ర్టాలకు 20-25 శాతానికి మించటంలేదు. కేంద్ర పన్నుల వాటా పంపకానికి 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవాలన్న 15వ ఆర్థిక సంఘం నిర్ణయం.. తెలంగాణ వంటి జనాభా నియంత్రిత రాష్ర్టాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రపన్నుల్లో రాష్ర్టాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచి ఫెడరల్‌ స్ఫూర్తి అని చెప్పారు. ఇప్పుడు దానిని 41 శాతానికి తగ్గించి ఆ ఫెడరల్‌ స్ఫూర్తినే దెబ్బతీశారని నిపుణులు విమర్శిస్తున్నారు.

ప్రగతిశీల విధానాలతో ఆర్థిక ప్రగతిలో పరుగులుపెడుతున్న తెలంగాణ నుంచి కేంద్రానికి ఏటా భారీ మొత్తంలో పన్నులరూపంలో ఆదాయం వెళ్తున్నది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను, కస్టమ్స్‌ పన్ను, ఇన్‌ కంట్యాక్స్‌ ,జీఎస్‌టీ, ఐజీఎస్‌టీ తదితర రూపాల్లో రాష్ట్రం నుంచి కేంద్రం ఖజానాకు ఏటా 50 వేల కోట్లకుపైగా చేరుతున్నాయి. కానీ ప్రతిగా కేంద్రం నుంచి 25 వేల కోట్లు కూడా రాష్ర్టానికి చేరడంలేదు. జనాభా తక్కువ ఉండి తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ర్టాలకు 15వ ఆర్థికసంఘం వెయిటేజీని తగ్గించటంతో కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లలో తక్కువ మొత్తం వస్తుంది. 2019-20 లో 18,964 కోట్లుగా ఉన్న రాబడి 16,241కు తగ్గుతున్నది. ఈ లోటును పూడ్చటానికి 723 కోట్లు స్పెషల్‌ గ్రాంట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ ఇంతవరకు స్పెషల్‌ గ్రాంట్ల ఊసే ఎత్తలేదు.

- Advertisement -

Latest news

ముంబయిపైకి దూసుకొస్తున్న నిసర్గ తుపాను

ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిపైకి తుపాను రూపంలో మరో ముప్పు దాడికి సిద్ధమైంది. ముంబయి తీరంలో 144 సెక్షన్‌ విధించారు....

Related news

ముంబయిపైకి దూసుకొస్తున్న నిసర్గ తుపాను

ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిపైకి తుపాను రూపంలో మరో ముప్పు దాడికి సిద్ధమైంది. ముంబయి తీరంలో 144 సెక్షన్‌ విధించారు....

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం…200 గుడిసెలు బుగ్గిపాలు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడలోని వాల్మీకి బస్తీలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలియగానే తాము 20 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చి...

తెలంగాణలో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వాన పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట,...

విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి

విద్యుత్ చట్ట -2003 కు కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.....