ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని అన్నారు. సీఎం కేసీఆర్ విజన్, పాలన కారణంగానే భాగ్యనగరం ఇంత ప్రశాంతంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వడంతో తాగునీటి సమస్య పరిష్కారమైందని అన్నారు కేటీఆర్. రాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలల్లోనే విద్యుత్ కష్టాలను అధిగమించామన్నారు. ఇప్పుడు రాష్ట్రం సర్ ప్లస్ పవర్ స్టేట్‌గా మారిందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ ఉంటే వార్త అన్న మంత్రి కేటీఆర్..కరెంట్ పోతే వార్తగా మారిందన్నారు.