27.4 C
Hyderabad
Monday, July 13, 2020

ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

జోగులాంబ గద్వాల : ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి.

దీంతో అప్పుడే ఊర్లోకి వచ్చిన ఆరగిద్ద – గట్టు బస్సులో గర్భిణి ఎక్కింది. పది నిమిషాల్లో గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతామనే లోగా.. ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. మొత్తానికి డ్రైవర్‌ సకాలంలో ఆస్పత్రి వద్దకు బస్సు తీసుకెళ్లాడు. కానీ బస్సు నుంచి దిగకముందే.. మగబిడ్డకు జన్మనిచ్చింది గర్భిణి. బస్సులో ఉన్న తోటి మహిళలు ఆమెకు కాన్పు చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...