ఆసరా పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరగకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నది ప్రభుత్వం . ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఈరోజు విడుదల చేసింది. దీనికోసం రూ.2931.17 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.