23.2 C
Hyderabad
Sunday, September 20, 2020

ఇంటర్‌లో సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సర్కారు లక్ష్యం నెరవేరుతున్నది. ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు అధిక మార్కులతో అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలలకు సంబంధించి ఇంటర్‌ సెకండియర్‌ లో 2,212 మంది పరీక్ష రాయగా 2,030 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 91.77 శాతంగా ఉన్నది. నాగార్జున సాగర్‌ బీసీ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.

జూనియర్‌ ఇంటర్‌లో 2,329 మంది పరీక్ష రాయగా 2,033 ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత 87.29 శాతంగా ఉన్నది. గిరిజన గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని జూనియర్‌ కళాశాలలకు చెందిన సెకండియర్‌ విద్యార్థులు 4,492 మంది పరీక్షరాయగా 3,822 మంది 85.08 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే 2.72 శాతం పెరిగింది. 4 కళాశాలల్లో వంద శాతం, 20 కళాశాలల్లో 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎస్సీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలల పరిధిలో సెకండియర్‌ విద్యార్థులు 10,064 మంది పరీక్ష రాయగా 8,996 మంది అంటే 89.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే 5.07 శాతం ఉత్తీర్ణత పెరిగింది. 21 కళాశాలల్లో వంద శాతం, 17 కళాశాలల్లో 90 శాతం పాసయ్యారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు.

పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 35 తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో తొమ్మిది కాలేజీలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 2,490 మంది పరీక్షలకు హాజరు కాగా 2,374 మంది ఉత్తీర్ణత సాధించారు. 95.3 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల సొసైటీ కార్యదర్శి వెంకటేశ్వరశర్మ తెలిపారు. ఇది రాష్ట్ర సగటు 68.86 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. 75 శాతం మంది విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించారని వారంతా ఏ గ్రేడ్‌లో నిలిచారన్నారు. ప్రథమ సంవత్సరం రెండు కాలేజీల్లో 100 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. 2,582 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 90.9 శాతం పాసయ్యారని తెలిపారు

- Advertisement -

Latest news

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది....

Related news

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది....

అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి కేటీఆర్

పేద దేశాల్లో క్రైస్త‌వ మిష‌న‌రీలు అందిస్తున్న సేవ‌లు మ‌రువ‌లేనివి అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో బిష‌ప్‌లు, క్రైస్త‌వ ప్ర‌ముఖుల‌తో ఏర్పాటు చేసిన...

నేరెడ్‌మెట్ లో‌ విషాదం…

నగరంలోని నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం బాలిక అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదాంతంగా మారింది. సుమేధ‌(12)‌ అనే బాలిక నిన్న సాయత్రం 7 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ప్ర‌మాద‌వ‌శాత్తు నాలాలో ప‌డిన...

బీహార్‌ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో పలు జిల్లాలు నీట మునిగాయి. వరద ఉదృతి పెరగడంతో కిషన్‌గంజ్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభానికి...