23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

ఇక సులువుగా భవన నిర్మాణ అనుమతులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన‌‌ టీఎస్ బీపాస్ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా దేశంలోనే శ‌ర‌వేగంగా ప‌ట్టణీక‌రణ చెందుతున్న రాష్ర్టాల్లో  తెలంగాణ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్. దాదాపుగా రాష్ర్టంలో 42 శాతం జ‌నాభా ప‌ట్టణ ప్రాంతాల్లో నివ‌సిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ప‌ట్టణాల్లో స‌రైన మౌలిక వ‌స‌తులు క‌ల్పించాలన్న ల‌క్ష్యంతో చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. పుర‌పాల‌న‌లో స‌మూల మార్పులు తేవాల‌నే ఉద్దేశంతో నూత‌న పుర‌పాల‌క చ‌ట్టాన్ని 2019లో తీసుకువచ్చినట్లు చెప్పారు. పౌరుడు కేంద్రంగా పార‌ద‌ర్శకంగా సేవ‌లందించాల‌న్నదే  రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యమన్నారు.ప‌ట్టణ ప్రగ‌తి కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి జ‌నాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయిస్తున్నామ‌ని తెలిపారు.  అయితే పట్టణ పౌరుడికి ఇబ్బందిగా మారిన సొంత ఇంటి నిర్మాణం అనుమతులను సరళతరం చేయడానికి 2015లో డెవ‌ల‌ప్‌మెంట్ ప‌ర్మిష‌న్‌ మేనేజ్‌మెంట్ సిస్టం ను అన్ని మున్సిపాలిటీల్లో ప్రవేశ‌పెట్టామన్నారు. దీనికి చ‌ట్టబ‌ద్ధత లేక‌పోవ‌డం వ‌ల్ల ప్రజ‌లు ఇబ్బంది ప‌డుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో 100 శాతం పార‌ద‌ర్శకత పెంచేందుకు స్వీయ ధృవీకరణ పత్రం విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019, జీహెచ్ఎంసీ చట్టం బిన్నంగా ఉన్నాయని..వీటికి ఏకరూపం తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న డీఎంపీఎస్ విధానానికి ఒక చట్టబద్ధత తీసుకువచ్చేలా టీఎస్ బీపాస్ ను తెచ్చామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

పేదవారిని దృష్టిలో ఉంచుకుని భవన నిర్మాణ అనుమతులు సులభంగా ఇవ్వాలన్నదే టీఎస్ బీపాస్ ముఖ్య ఉద్దేశమన్నారు మంత్రి కేటీఆర్.  ఈ కొత్త విధానములో 75 గజాల నుంచి 600 గజాల వరకు ఇల్లు కట్టుకునే మధ్యతరగతి ప్రజలు తక్షణ అనుమతి తీసుకొచ్చన్నారు. దీని వల్ల 85 శాతానికి పైగా దరఖాస్తులు త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు. ఇక 600 గజాలు లేదా లే అవుట్ అనుమతి అవసరం ఉన్నా..టీఎస్ ఐపాస్ మాదిరిగా 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 21 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే.. 22వ రోజు డ్రీమ్డ్ అప్రూవల్ అనే విధానాన్ని తెస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల్లో లోపాలుంటే..మొదటి పది రోజుల్లోనే దరఖాస్తులను తిరస్కరించే అధికారం మున్సిపాలిటీలకు ఉంటుందన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను కూడా 15 రోజుల్లోగా ఇచ్చేలా చట్టంలో రూపకల్పన చేశామన్నారు.  75 గజాల స్థలం ఉంటే అనుమతులు అవసరం లేదని..కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే అవసరం ఉంటుందన్నారు. 75 నుంచి 600 గజాల వరకు తక్షణమే అనుమతి, తక్షణమే స్వీయ ధృవీకరణ పత్రం అవసరం ఉంటుందన్నారు. ఎవరైనా అధికారులు కాలయాపన చేస్తూ నిర్దిష్ట సమయంలో అనుమతులు ఇవ్వకుంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.  అటు పౌరులు తప్పు చేసినా..వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలంలో ఇన్ స్టంట్ పర్మీషన్ తీసుకుని..ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం చేసినా..ఎలాంటి నోటీసులు లేకుండా భవనాన్ని కూల్చేస్తామని చెప్పారు. ఇందు కోసం రాష్ట్ర స్థాయిలో ఛేజింగ్ కమిటీ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరో ఛేజింగ్ కమిటీ, సెల్ ఉంటుందన్నారు.

మరోవైపు టీఎస్ బీపాస్ అంశాలను గమనిస్తే.. 75 చదరపు గజాలలోపు స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నామమాత్రంగా ఒక్క రూపాయి చెల్లించి భవన నిర్మాణ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. 75 చదరపు గజాల నుంచి 239 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో ఏడు మీటర్ల ఎత్తు వరకు అంటే జీ ప్లస్‌-వన్  నివాస భవనాలకు తక్షణ అనుమతి ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగానే అనుమతి వస్తుంది. 239 చదరపు గజాల నుంచి 598 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో పది మీటర్ల ఎత్తు వరకు అంటే జీ ప్లస్‌ -2  వరకు నివాస భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ  ఆధారంగా అనుమతులు ఇస్తారు. ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. ఇక 598 చదరపు గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణం, జీ ప్లస్‌ 2 కంటే ఎక్కువ అంతస్తులు ఉండే ప్లాట్లలో, నివాసేతర భవనాలకు సింగిల్‌ విండో పద్ధతిలో టీఎస్‌ బీపాస్‌ అనుమతులు ఇస్తారు. ఎన్‌వోసీ కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తులను పరిశీలించి 21 రోజుల్లో అనుమతులు జారీ చేస్తారు. ఏదైనా కారణంతో ఆ గడువులోపు అనుమతులు రాకుంటే దరఖాస్తుదారుడు అనుమతి వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. 22వ రోజు ఆన్‌లైన్‌లో అనుమతి పత్రం పొందవచ్చు. 239 చదరపు గజాల కంటే ఎక్కువ, 598 చదరపు గజాల విస్తీర్ణం కలిగి 10 మీటర్ల ఎత్తుతో నిర్మించే నివాస భవనాలకు సదరు యజమాని ఇచ్చే స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. అలాగే నివాసేతర భవనాలకు ఆర్కిటెక్ట్‌తో అటెస్ట్‌ చేయించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఇస్తారు. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా జారీచేసిన అన్ని అనుమతులకు తదుపరి తనిఖీ జరుగుతుంది. వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేసినట్టు తేలితే నోటీసు ఇవ్వకుండానే జరిమానా విధించడం, భవనాన్ని కూలగొట్టడం, స్వాధీనం చేసుకోవడం, సీల్‌ చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తాత్కాలిక లేఅవుట్‌ ప్లాన్‌ అనుమతిని ఆన్‌లైన్‌లో 21 రోజులలో జారీ చేస్తారు. లే అవుట్‌ పూర్తిచేసిన తర్వాత లైసెన్స్‌ కలిగిన సాంకేతిక సిబ్బందితో అటెస్ట్‌ చేయించి, జిల్లా కమిటీలు పరిశీలించాక లేఅవుట్‌ తుది అనుమతులను జారీ చేస్తారు. మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్ల వద్ద తనఖా రూపంలో పెట్టిన ప్లాట్లను లేఅవుట్‌ తుది అనుమతి ఇచ్చిన 21 రోజుల తర్వాత విడుదల చేస్తారు. అనధికార నిర్మాణాలు, లేఅవుట్ల గుర్తింపు, నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాన్ని ప్రభుత్వం నియమిస్తుంది. అనుమతి పొందిన ప్లాన్‌కు అనుగుణంగా లేని నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేసేలా చర్యలు తీసుకుంటుంది. అనుమతులు తీసుకోకుండా భూమిని అభివృద్ధిచేసిన డెవలపర్‌కు ఆ భూమి విలువలో 25 శాతం జరిమానా విధిస్తారు.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...