24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

కేసీఆర్‌ మాటిచ్చారు.. కేటీఆర్‌ నెరవేర్చారు

ఇచ్చిన మాటను నెరవేర్చడం.. హామీలను తీర్చడంతో టీఆర్‌ఎస్‌ సర్కారు తర్వాతే ఎవరైనా. ఒక దివ్యాంగుడైన వృద్ధుడికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చిన ప్రభుత్వం.. మరోసారి భేష్‌ అనిపించుకున్నది. ఆనాడు ముఖ్యమంత్రి మాట ఇవ్వగా.. ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఆ హామీని నెరవేర్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న టోలిచౌకీలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరై ప్రగతిభవన్‌కు బయలుదేరారు. కాన్వాయ్‌ టోలిచౌకి సమీపంలోకి రాగానే అక్కడ ఫ్లై ఓవర్‌కు సమీపంలో మహ్మద్‌ సలీం అనే దివ్యాంగ వృద్ధుడు రోడ్డు పక్కన కాగితాలు పట్టుకొని సీఎం కేసీఆర్‌ వైపు దీనంగా చూస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. ఇది గమనించిన సీఎం కాన్వాయ్‌ను ఆపి సలీంను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఆయన సమస్యలేంటో తెలుసుకున్నారు. తాను గతంలో డ్రైవర్‌గా పని చేశానని సలీం చెప్పాడు. నాలుగేండ్ల క్రితం బిల్డింగ్‌ పైనుంచి పడ్డానని ఎడమకాలు తుంటి ఎముక విరిగిందని.. అల్సర్‌తోనూ బాధపడుతున్నానని చెప్పాడు. తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని తగిన సహాయం చేయాలని కోరాడు. అటు తనకు వికలాంగ పింఛన్‌ కూడా రావడం లేదని, ఓ బ్రోకర్‌ పింఛన్‌ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని వాపోయాడు. అద్దె ఇంట్లో ఉంటున్న తనకు డబుల్‌ బెడ్రూం ఇంటితో పాటు, రేషన్‌కార్డు, వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరాడు. సలీం సమస్యలను సావధానంగా విన్న సీఎం కేసీఆర్.. వాటిని తీర్చడంతోపాటు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు మంజూరు చేస్తానని  హామీనిచ్చారు.

 సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి సహా ఇతర అధికారులు అదే రోజు గోల్కొండ మోతీ మహల్‌లోని సలీం ఇంటికెళ్లి వికలాంగ పింఛన్‌ను మంజూరు చేశారు. రెండు నెలల పింఛన్‌ను అక్కడికక్కడే అందజేశారు. అటు జియాగూడలో డబుల్‌ బెడ్రూం ఇంటిని మంజూరు చేశారు. అక్కడ ప్రభుత్వం చేపట్టిన 840 ఇండ్లతో కూడిన డిగ్నిటీ హౌసింగ్ కాలనీ నిర్మాణం పూర్తి కావడంతో.. మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. మొట్టమొదటగా మహ్మద్‌ సలీంకు అందులో డబుల్ బెడ్రూం ఇంటి తాళాలను అందజేశారు.

డబుల్ బెడ్ రూం ఇల్లు పొందిన లబ్దిదారుడు సలీం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల సంక్షేమాన్ని కాంక్షించే ఇలాంటి ప్రభుత్వంతోనే సమస్యలన్నీ తీరుతాయన్నాడు. దివ్యాంగుడైన తనకు నెలకు రూ. 8 వేలు ఇంటి కిరాయి కట్టే స్థోమత లేకపోయిందని… ఇప్పుడు డబుల్‌ బెడ్రూం ఇల్లు రావడంతో కిరాయి తిప్పలు తప్పాయని చెప్పాడు. అలాగే  నెలకు 3వేల 116 రూపాయల పింఛన్‌ కూడా వస్తుండటంతో తమ సమస్యలన్నీ తీరిపోయాయన్నాడు. ఇంత గొప్ప సహాయం చేసిన తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ కు.. తనూ, తన కుటుంబం ఆజన్మాంతం రుణపడి ఉంటుందని మహ్మద్ సలీం చెప్పాడు. 

సీఎం కేసీఆర్ చేసిన సహాయంతో కష్టాలన్నీ తీరిపోయి మహ్మద్‌ సలీం కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.   

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...