29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ

కరోనా విజృంభిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, తదుపరి నిరోధక చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించాయి. ఈ సమయంలో వైద్య సామగ్రిని సమకూర్చుకోవడం, ప్రజల్లో వైరస్ గురించి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. బాధితులకు చికిత్స అందించడంలో, నిర్ధారణ పరీక్షలు చేయడంలోనూ ఒక ప్రణాళిక బద్దంగా నడుచుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే మరింత ముందుచూపుతో వ్యవహరించింది. కరోనా చికిత్స కోసం గాంధీ వంటి ప్రధాన దవాఖానను కేటాయించడంతోపాటు ప్రత్యేకంగా టిమ్స్ దవాఖానను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పుడప్పుడే నమోదవుతున్న కేసులతో పాటు భవిష్యత్ లో పెద్దసంఖ్యలో కేసులు వెలుగుచూస్తే ఎలా ఎదుర్కోవాలనే కోణంలోనూ ఆలోచించింది.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకుపోతోంది. ప్రధాన దవాఖానలైన కింగ్ కోఠి, ఫీవర్, ఛాతి దవాఖానల్లో కోవిడ్  చికిత్స అందించేలా ఏర్పాటు చేసింది. వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన వైద్యం అందించాలనే లక్ష్యంతో కరోనా చికిత్సను వికేంద్రీకరించింది. దీంతో అన్ని జిల్లా, ఏరియా దవాఖానల్లో కరోనా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పరీక్షల సంఖ్యను భారీగా పెంచడం, సమర్థ వంతమైన ట్రాకింగ్, బాధితులకు తక్షణం వైద్య సదుపాయాలు అందించడం అనే వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఇందులో ముఖ్యమైన కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తున్నది.

నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 10 లక్షల జనాభాలో 140 మందికి టెస్టులు చేయాలని సూచించింది. ఈ లెక్కన తెలంగాణ జనాభాను బట్టి రోజుకు 5,600 పరీక్షలు నిర్వహించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సంఖ్యను క్రమంగా 40 వేలకు పెంచింది. దీని ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందిలో 25 వేల పరీక్షలు నిర్వహిస్తున్నది. గతంలో కేవలం ఆర్టీపీసీఆర్ పరీక్షలను మాత్రమే నిర్వహించిన సర్కారు.. కేవలం 15 నిమిషాల్లో ఫలితాలు ఇచ్చే ర్యాపిడ్ టెస్టులను చేపట్టింది.అటు రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో కలిపి 1100 వైరస్ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాంతో పాటు కరోనా మొబైల్ టెస్ట్ బస్సులను సమకూర్చింది. కరోనా బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని సీఎం కేసీఆర్ చెప్పడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లో ఉన్న ఫార్మా కంపెనీల సాయంతో విలువైన అత్యవసర మందులు రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి వచ్చాయి. రెమ్డిప్ విర్,  ఫావిపిరవిర్, డెక్సామెథాసోన్ సహా ఖరీదైన మెడిసిన్‌గా చెప్పుకొనే టోస్లీజుమాబ్ ఇంజెక్షన్లు కొరత లేకుండా బాధితులకు ఉచితంగా అందుతున్నాయి.

మరోవైపు జీహెచ్ఎంసీ సహా అన్ని జిల్లాదవాఖానల్లోని పడకలకు ఆక్సిజన్ సౌకర్యాన్ని పెంచారు. అవసరాలకు అనుగుణంగా వెంటిలేటర్ల కొనుగోలు, వైద్యసిబ్బంది నియామకం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకున్నది. కరోనా విజృంభించిన తొలిరోజుల్లో దేశంతో పాటు తెలంగాణలోనూ రికవరీ రేటు తక్కువగా ఉన్నది. అయితే అతితక్కువ కాలంలోనే దేశంలోని చాలా రాష్ట్రాలను దాటుకొని రికవరీ రేటు మన రాష్ట్రంలో పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు దేశంలో 74% ఉంటే.. మన రాష్ట్రంలో 77.3శా తంగా నమోదైంది. నాణ్యమైన వైద్యసేవలు అందుతుండటంతో మరణాల రేటు 1% కంటే  తక్కువగానే కొనసాగుతున్నది. ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరుకున్నప్పటికీ రికవరీ రేటులో గణనీయమైన వృద్ధి, మరణాలు 1% కంటే తక్కువగా ఉండటం సానుకూలంశాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇద్దరు సీనియర్ అధికారులపై ఎస్ఈసీ బదిలీ వేటు

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొరడా ఝలిపించారు. సీనియర్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ...

లద్ధాఖ్‌లో రిపబ్లిక్ డే.. ఫోటోస్ చూశారా?

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇదే టైంలో గడ్డ కట్టే మైనస్ డిగ్రీల చలిలో లద్ధాఖ్ లో కూడా...

మోదీ తలపాగా వెరీ స్పెషల్.. ఎవరిచ్చారంటే..

భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా(టర్బన్) అందర్నీ విశేషంగా ఆకర్షించింది. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటించే సమయంలోను.. ఆ...

తల్లిదండ్రులకు గుడి కట్టి పూజిస్తున్నారు

తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. ఇప్పుడు అదే మాటను ప్రాక్టికల్ గా నిజం చేశారు కర్ణాటకలోని ముగ్గురు అన్నదమ్ములు. తల్లి దండ్రులకు గుడి కట్టి పూజిస్తున్నారు.