18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

నేడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్నకేసీఆర్

ఇండో- చైనా సరిహద్దులో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కల్నల్ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ఓదార్చనున్నారు. సంతోష్‌ బాబు మరణంతో అయిన గాయాన్ని కొంతైనా మాన్పించేలా ధైర్యం చెప్పనున్నారు. దేశానికి సంతోష్ బాబు చేసిన సేవలు చిరస్మరణీయంగా, యువతకు స్పూర్తిగా ఉండాలని సీఎం కేసీఅర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు గ్రూప్ 1 జాబ్, 600 గజాల ఇంటి జాగాను కూడా ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సూర్యాపేటలో వీర సైనికుడి కుటుంబాన్ని పరామర్శించి.. 5 కోట్ల సాయానికి సంబంధించిన చెక్కు, ఉద్యోగానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతరత్రా సాయాలను స్వయంగా అందజేయనున్నారు.                                  

ప్రభుత్వ సాయం గురించి కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి చెప్పాలని సీఎం కేసీఆర్ .. మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు. దీంతో సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు నివాసానికి మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు వెళ్లారు. అమర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వ సాయం గురించి వివరించారు. సీఎం కేసీఆర్ రాకపై సమాచారమిచ్చారు. ప్రభుత్వ సాయంపై సానుకూలంగా స్పందించిన సంతోష్ బాబు కుటుంబం.. సాయాన్ని తీసుకునేందుకు ఒప్పుకుంది. సంతోష్ బాబు సేవలు యువతకు స్ఫూర్తిగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. అమరుడి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు..

సీఎం కేసీఆరే స్వయంగా వచ్చి సాయం అందిస్తారని చెప్పడంతో తాము ఆశ్చర్యానికి లోనయ్యామని సంతోష్ బాబు తల్లిదండ్రులు బిక్కుమళ్ల మంజుల, ఉపేందర్, భార్య సంతోషి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ది పెద్దమనసు అని.. తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచి ధైర్యాన్ని నింపిన మహనీయుడని కొనియాడారు. సీఎం కేసీఆర్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. తమతోపాటు ఇతర జవాన్ల కుటుంబాలకు  సాయం ప్రకటించి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు.

కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కరన్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. 

- Advertisement -

Latest news

Related news

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...