24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీ

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ప్రగతిభవన్‌ లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి.. ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై గురువారం సీఎం కేసీఆర్‌ మంత్రులు, టీఆర్ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్‌ పై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలో అమలువుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ శ్రేణులు కార్యదీక్షతో ముందుకుసాగాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే ధరణి పోర్టల్‌ కు రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ భూ తగాదాలు పుట్టించి పబ్బం గడిపే కొందరి ఆటలకు ధరణి చరమగీతం పాడిందన్నారు. మంత్రులు, పార్టీ కార్యదర్శులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే ఉందని చెప్పారు. ఇందుకోసం కిందిస్థాయిలో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...