బల్దియా ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతీ రోజూ పలు డివిజన్లలో రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. ఇక కేటీఆర్ ప్రచారానికి అద్భుత స్పందన వస్తొంది. ఎక్కడికెళ్లినా ప్రభంజనంలా ప్రజలు తరలివస్తున్నారు. నీరాజనాలు పలుకుతున్నారు.
ఇవాళ మంత్రి కేటీఆర్ ఉప్పల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈసీఐఎల్ చౌరస్తాలో, ఐదు గంటలకు మల్లాపూర్‌లోని శివాజీ హోటల్ జంక్షన్లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం ఆరు చిలకనగర్ జంక్షన్ లో, రాత్రి ఏడు గంటలకు రామంతపూర్ డివిజన్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించనున్నారు