21.7 C
Hyderabad
Friday, January 22, 2021

ఇవాళ మూడు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం

బల్దియా ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోజుకు రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు.

ఇవాళ మంత్రి కేటీఆర్.. మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి  నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మల్కాజ్‌గిరి నియోజకవర్గం అల్వాల్‌లోని ఇందిరాగాంధీ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఐదు గంటలకు యాప్రాల్‌ లోని అంబేద్కర్‌ చౌరస్తాలో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆనంద్‌ బాగ్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక రాత్రి ఏడుగంటలకు రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి చౌరస్తాలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. రాత్రి ఎనిమిది గంటలకు కొండాపూర్‌లోని ఆర్టీవో ఆఫీస్‌ చౌరస్తాలో, తొమ్మిది గంటలకు హైదర్‌ నగర్‌ లోని రాఘవరెడ్డి ఫంక్షన్‌ హాల్‌ చౌరస్తాలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

మరోవైపు మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోలకు అశేష జనవాహిని కదిలివస్తోంది. ఆరేళ్లలో హైదరాబాద్‌ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి తమ ఓటంటూ నగర వాసులు తేల్చి చెబుతున్నారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...