27.2 C
Hyderabad
Friday, December 4, 2020

ఈద్ వేళ‌.. నిర్మానుష్యంగా చార్మినార్‌

హైద‌రాబాద్‌: ఈద్ ఉల్ ఫిత‌ర్ ప‌ర్వ‌దినాన్ని హైద‌రాబాదీలు ఇండ్ల‌లోనే సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.  ఈద్ రోజున ముస్లింల‌తో నిండిపోయే చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాలు ఇవాళ నిర్మానుషంగా క‌నిపించాయి.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.  న‌గ‌రంలో ఎటువంటి ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి లేక‌పోవ‌డం వ‌ల్ల‌.. ఈద్ పండుగ రోజున కూడా ముస్లింలు ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా స్పందించారు.  చార్మినార్ వ‌ద్ద ఉన్న మ‌క్కా మ‌సీదులో ఎటువంటి సామూహిక ప్రార్థ‌న‌లు జ‌ర‌గ‌లేదు.  ఆ ప్రాంతం అంతా ఇవాళ క‌ళ ‌త‌ప్పినట్లుగా మారింది. మ‌క్కా మ‌సీదులో ఇవాళ ఈదు ప్రార్థ‌న‌లు జ‌ర‌గ‌లేదు.  లాక్‌డౌన్4 నేప‌థ్యంలో ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని మ‌సీదుల‌ను ఉద‌యం 6 గంట‌ల నుంచే మూసివేశారు.  

న‌గ‌రంలో ఉన్న మేటి మ‌సీదులు.. ఈద్గా మీర్ ఆల‌మ్‌, ఈద్గా బిలాయి, ఈద్గా మాద‌న్న‌పేట‌ల‌తో పాటు ఇత‌ర పెద్ద‌ మ‌సీదుల్లోనూ ఈద్ ప్రార్థ‌న‌ల‌ను నిర్వ‌హించ‌లేదు.  ఎటువంటి సామూహిక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించ‌రాదు అంటూ ప్ర‌తి మ‌సీదు ముందు బ్యాన‌ర్ల‌ను పెట్టారు. జామియా నిజామి చేసిన అభ్య‌ర్థ‌న‌ల పోస్ట‌ర్‌ను కూడా మ‌సీదుల ముందు ఉంచారు. మొఘ‌ల్‌పురాలో ఉన్న ప్ర‌ఖ్యాత జామా మ‌సీద్ హ‌ఫీజ్ ద‌నాఖాను కూడా మూసివేశారు. 

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.