దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, లక్నోలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. జమ్మూకాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బెంగాలీలు, కన్నడవాసులు,శరన్నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.