25.3 C
Hyderabad
Wednesday, June 3, 2020

ఊపందుకున్న భవన నిర్మాణరంగం

లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో నిర్మాణరంగం ఊపందుకుంటున్నది. దీంతో సాగునీటి ప్రాజెక్టులు, సీసీ రోడ్లు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లనిర్మాణం శరవేగంగా సాగుతున్నది. దీంతోపాటు ప్రైవేటురంగంలోనూ భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వం స్టీలు, సిమెంట్‌ తోపాటు, హార్డ్‌వేర్‌, ఇతర గృహోకరణ దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో ఇండ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికితోడు ఇసుక క్వారీలకు అనుమతివ్వడంతో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఇసుక బుకింగ్‌లు వస్తున్నాయి. నిబంధనల మేరకు లారీల ద్వారా ఇసుక సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది.

ఇక లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు కొంతమంది సొంత ప్రాంతాలకు పయనమయినా.. కొన్ని పెద్ద సంస్థలు తమవద్ద పనిచేసేవారికి నిర్మాణ ప్రాంతంలోనే నివాసాలు కల్పించాయి. మరికొన్ని సంస్థలు ఉన్న కొద్దిమంది కూలీలతోనే పనులు చేస్తున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్‌, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, బండ్లగూడ, శంషాబాద్‌ తదితర ప్రాంతాలల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి.  నిర్మాణ పనులకు ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంపై వలసకూలీల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సొంత గ్రామాలకు వెళ్లాలనుకున్నవారు నిర్ణయాన్ని మార్చుకుని పనులలో నిమగ్నమయ్యారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులకు గురైన తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు కాంట్రాక్టర్లు భౌతికదూరం నిబంధనను అమలుచేస్తూ భవన నిర్మాణ కార్మికులతో పనులు చేయిస్తున్నారు.

కరోనా ప్రభావం రియల్‌ ఎస్టేట్ రంగంపై పెద్దగా ఉండబోదని, మూడునెలల్లోగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నిర్మాణసంస్థలు చెబుతున్నాయి. మరో ఏడాది వరకు నిర్మాణరంగానికి వచ్చే ఢోకా ఏమీలేదని క్రెడాయ్‌ ప్రతినిధులు తెలిపారు. కరోనా రాకముందు వరకూ జరిగిన అమ్మకాలే హైదరాబాద్‌ నిర్మాణరంగాన్ని నిలబెట్టడంలో తోడ్పడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Latest news

తెలంగాణలో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వాన పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట,...

Related news

తెలంగాణలో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వాన పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట,...

విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి

విద్యుత్ చట్ట -2003 కు కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.....

తమిళనాడులో వేగంగా విస్తరిస్తున్న కరోనా

తమిళనాడులో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1162 కరోనా కేసుల నమోదు కావడంతో బాధితుల సంఖ్య  23,495కు పెరిగింది. ఒక్క చెన్నైలోనే 964 పాజిటివ్‌ కేసులు బయటపడ్డంతో...

అసోంలో కొండ చరియలు విరిగి 20మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షాలతో దక్షిణ అసోంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో 20 మంది మృతిచెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న...