పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకుండానే హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చి ప్రపంచ పటంలో స్థానం కల్పించారన్నారు. కేవలం మాటలు చెప్పే మోదీ సర్కారు కావాలో.. అందరికీ అండగా నిలిచే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేయూతనివ్వాలో ప్రజలు ఆలోచించాలన్నారు. హైదరాబాద్ గాంధీనగర్ లోని జనప్రియ అపార్ట్ మెంట్ లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.
కరోనా సమయంలో పేదలను అన్ని విధాల ఆదుకున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. వరదలు వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ నేతలే ప్రజలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో 5.50 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మోదీ సర్కార్ రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. ఒక్క ప్రాజెక్టు కైనా కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.హైదరాబాద్‌కు రోహింగ్యాలు వస్తే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ముషీరాబాద్‌లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు
గ్రేటర్ ఎన్నికలతో ఢిల్లీ గుజరాత్ నేతలకు ఏమి పని అని ప్రశించారు ఎమ్మెల్సీ కవిత. ఆరేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి మోడీ సర్కార్ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు సీఎం కేసీర్ అండగా నిలిచి 10 వేల సహాయం ఇచ్చారని గుర్తు చేశారు. వరద బాధితులకు అందించాల్సిన సాయాన్ని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాసి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వరద సహాయం అందని వారికి అందిస్తామన్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని మంగళ్‌హాట్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పరమేశ్వరిసింగ్కి మద్దతుగా ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు..
మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహిస్తుండటంతో క్యాడర్లో నయా జోష్ సంతరించుకుంది. ఎన్నికల ప్రచారానికి భారీగా తరలివస్తున్న జనాలు టీఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారు