సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. సభ సందర్భంగా స్టేడియం లోపల, చుట్టుపక్కల భద్రతా ఏర్పట్లకు సంబంధించిన అంశాలను సీఎం అంజనీ కుమార్ వివరించారు. అదేవిధంగా సభా వేదికను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.