39.7 C
Hyderabad
Thursday, May 28, 2020

ఎవుసం నవశకం

రైతులకు లాభాలు వచ్చేలా వ్యవసాయం కొనసాగాలన్నారు సీఎం కేసీఆర్. నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం, పంటల మార్పిడి తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌.. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో లాభసాటి సాగుపై పలు నిర్ణయాలు తీసుకొన్నారు. తెలంగాణలో చాలా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో చక్కటి నేలలు ఉన్నాయని.. ఇంత టిపికల్‌ ల్యాండ్‌ మిక్స్‌ ప్రపంచంలోనే అరుదుగా ఉన్నదన్నారు. అందువల్లనే ఇక్రిశాట్‌ లాంటి అంతర్జాతీయ పరిశోధన సంస్థ పటాన్‌చెరులో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

రైతాంగం ఒక నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాల్సిన అవసరమున్నదన్నారు సీఎం కేసీఆర్‌. దేశంలో ది బెస్ట్‌ కాటన్‌ తెలంగాణతోపాటు కేవలం విదర్భలో మాత్రమే పండుతుందన్నారు. గతేడాది వానకాలం, యాసంగిలో కలిపి 1.23 కోట్ల ఎకరాల్లో రకరకాల పంటలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి? ఎట్ల వేయాలనేది ప్రభుత్వమే చెబుతుందన్నారు. ఈసారి రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈసారి వర్షాధారం కాకుండా.. బోర్లు, ప్రాజెక్టుల నీళ్ల కింద పత్తి పత్తి సాగు చేయాలని కోరారు.

వానకాలంలో మొక్కజొన్న వెయ్యొద్దని.. దాని బదులు కంది గానీ పత్తి గానీ వేయాలన్నారు సీఎం కేసీఆర్‌. మక్కజొన్న 25 క్వింటాళ్ల కంటే ఎక్కువ రాదని.. అదే కంది, పత్తి వేస్తే ఎక్కువ లాభం వస్తుందన్నారు. యాసంగిలో మక్కజొన్న ఎంత పండించాలనేది ప్రభుత్వం చెప్తుందన్నారు. 15 లక్షల ఎకరాల్లో కందిపంట వేస్తే.. ఆ పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కందితో పాటు కూరగాయలు, మిర్చి, సోయా తదితర పంటలు కలిపి ఈసారి సాగు విస్తీర్ణం కోటీ 35 లక్షల ఎకరాలు అవుతుందన్నారు.

దేశంలో ఎక్కడలేని విధంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 40 లక్షల నూతన గోడౌన్లతోపాటు కోల్డ్‌ స్టోరేజీల కోసం స్థలాలను సేకరిస్తున్నామని.. ఇప్పటికే  90 శాతం భూ సేకరణ పూర్తయిందన్నారు. ప్రభుత్వం చెప్పిన మేరకు పంటలు వేసే వారందరికీ రైతుబంధు నిరాటంకంగా ఇస్తామని.. అలా చేయకుండా వేరే పంట వేస్తే వాళ్లకు రైతుబంధు రాదని తేల్చిచెప్పారు.

అధునాతన పద్ధతుల్లో పంటలు పండించడం కోసం రాష్ట్రంలో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. నీటితీరువా బకాయిలు రద్దు చేసి రైతులకు ఉచితంగా నీళ్లిస్తున్న రాష్ట్రం కూడా మనదే అన్నారు. రాష్ట్రంలో 2604 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశామన్న సీఎం కేసీఆర్‌.. వాటి నిర్మాణం కోసం 350 కోట్ల నిధులు కూడా కేటాయించామన్నారు. అటు ప్రతీ క్లస్టర్‌ కు ఒక ఏఈవోను నియమించామన్నారు.

మొత్తంగా రాష్ట్ర రైతాంగం ప్రభుత్వ మార్గదర్శనంలో నడిచి అద్భుత ఫలితాలను సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు.

- Advertisement -

Latest news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

Related news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారిక...

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం, థియేటర్‌లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు....

యంగ్‌ లుక్‌లో మహేశ్‌ సెల్ఫీ..ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ మహేశ్‌బాబు లాక్‌డౌన్‌ కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్‌ హోంక్వారంటైన్‌ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో...