24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

ఏపీ ఎత్తిపోతను నిలువరించండి

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి అదనంగా రోజుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచే పనులకు ఆమోదాన్ని తెలుపుతూ ఈనెల 5న ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 203పై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులు సమగ్రంగా చర్చించారు.

అటు శ్రీశైలం నుంచి అదనపు జలాలను తరలించేందుకు కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నదనే సమాచారంతో గతంలోనే బోర్డుకు ఫిర్యాదుచేసినా ఏపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. జీవో 203 జారీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే. ఏకపక్షంగా కొత్త ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించడం శ్రీశైలం జలాలపై ఆధారపడిన తెలంగాణలోని తాగు, సాగునీటి అవసరాలకు విఘాతం కలిగించడమే. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద టెలిమెట్రీ కూడా ఏర్పాటుచేయకుండా ఏపీ ప్రభుత్వం కృష్ణాజలాలను లెక్కలేకుండా తరలిస్తున్నది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ కుట్రలను ఆధారాలతో సహా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు ఉంచడంతోపాటు సుప్రీంకోర్టులోనూ ప్రత్యేకలీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపు సమయంలోనే శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు జలాల తరలింపును తిరస్కరించారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 11వ షెడ్యూల్‌లోని సెక్షన్‌-85(8)(డీ), క్లాజ్‌-7 ప్రకారం చట్టబద్ధమైన అధికారాలున్న కృష్ణా బోర్డు.. అవతలి బేసిన్‌కు జలాలను తరలించే కొత్త ప్రాజెక్టును సమర్ధించడంగానీ, సిఫారుసు కానీ చేయొద్దు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేనందున ఇది అక్రమ ప్రాజెక్టు. బోర్డుకు సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండా జీవో జారీ చేశారు. బోర్డు జోక్యం చేసుకొని ఏపీ జీవో 203 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచేందుకు చేపట్టనున్న పనులకు టెండర్లు పిలకుండా నిలువరించాలి.

ఏపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని తెలంగాణ తీవ్రంగా పరిగణించడంతో కృష్ణా బోర్డు అప్రమత్తమైంది. తెలంగాణ నీటిపారుదలశాఖ నుంచి ఫిర్యాదు వస్తుందని ముందుగానే భావించిన బోర్డు అధికారులు.. తదుపరి చర్యలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఈఏడాది జనవరిలోనే తెలంగాణ నీటిపారుదలశాఖ తమకు సమాచారమివ్వడం, ఏపీని వివరణ కోరినా బదులు ఇవ్వకపోవడంపై బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకుండానే పరిపాలనా ఆమోదం ఇస్తూ జీవో ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మరోసారి లిఖితపూర్వకంగా, ఆధారాలతో సహా ఏపీ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయడంతో వెంటనే ఈ అంశాన్ని కేంద్రానికి చేరవేసేందుకు రెడీ అవుతోంది.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...