21.2 C
Hyderabad
Monday, January 18, 2021

ఐటీ టవర్ కు శంఖుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దుద్దెడ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేశారు. 2000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం ఈ ఐటీ టవర్ ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.45 కోట్లు వెచ్చించింది.

ఐటీ టవర్ శంకుస్థాపనకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ఐటీ రంగంలో పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర రాజధానికి సిద్దిపేట అత్యంత సమీపంలో ఉందని.. ఇది అత్యంత క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. భవిష్యత్‌లో జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో జోలాన్ టెక్నాలజీ , విసాన్ టెక్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ వంటి పలు కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...