24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

ఐడియా అదిరింది!.. పక్షి ప్రేమికుడికి సలాం..

ఇదిగో ఈ ఫోటో చూడండి.. ఎంత చక్కని ఉపాయం కదూ..  పనికిరాని డబ్బాతో తయారు చేసినది. పక్షులకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఒకేచోట ఏర్పాటు చేశారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఇది తయారు చేసిన పక్షి ప్రేమికుడు ఎవరోగానీ అతనికి సలాం చేయాలి. ఎందుకుంటే..  ఎండలు మండిపోతున్నాయి. మనుషులకే ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఇక పక్షుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆహారం, నీటికోసం ఎండలో ఎంతో దూరం ప్రయాణిస్తే తప్ప అవి బతికే పరిస్థితి లేదు.  ఎండాకాలం తిండికి, తాగునీటికి పక్షులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కనీసం తాగటానికి నీళ్లు దొరక్క పెద్దసంఖ్యంలో చనిపోతుంటాయ్‌. 

పక్షులు పర్యావరణ సమతుల్యతకు ఎంతో దోహదపడుతాయి. ఒకప్పుడు పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా పక్షుల సందడి కనిపించేది. రానురాను వాటి ఉనికి అంతరించి పోయింది.  పట్టణాల్లో అసలు పక్షుల జాడే లేదు.   పక్షులు అంటే ఇలా ఉంటాయని టీవీలు, కంపూటర్లు, సెల్‌ఫోన్లలో  మనపిల్లలకు చూపించాల్సిన దుస్థితి ఏర్పడింది. పక్షులను ప్రత్యక్షంగా చూడాలంటే అడవులకు వెళ్లాల్సిన అవసరమొచ్చింది. 

పర్యావరణాన్ని పట్టించుకోక పోతే, ఎన్నో అనర్థాలను మనకు మనంగా తెచ్చుకున్నట్లే. మనుషులు చేసే కొన్ని పనుల వల్ల ఎన్నో రకాల పక్షులు, జంతువులు నేడు అత్యంత ప్రమాదంలో పడ్డాయి. పక్షులను, పర్యావరణాన్ని కాపాడటానికి మన వంతు ప్రయత్నం చేయాలి. సో.. మీ ఇంటి ముందో, ఆరుబయటో, మీ పొలం వద్దనో, ఏ చెట్టుకో, తీగకో పక్షులకోసం పాత రేకు డబ్బాతో పైన ఫొటోలోలాగ ఓ తయారు చేసి పక్షుల ప్రాణాలు కాపాడండి. ప్రకృతిని కాపాడినవారవుతారు. పకృతి వైపరీత్యాల వల్ల సంభవించే దుష్పరిణామాల నుండి మనల్ని మనం కాపాడుకున్నవారవుతాము.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...