జీహెచ్ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.67 వేల కోట్లు హైదరాబాద్లో వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేశామన్నారు. ఐదేండ్ల అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ఒకచోట చేర్చి ప్రగతి నివేదిక విడుదల చేస్తామన్నారు. అటు ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమాచారాన్ని తీసుకుపోవాలని కార్పొరేటర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు..