27.9 C
Hyderabad
Friday, January 22, 2021

ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఐనవోలు మల్లన్న ఆలయం సిద్ధమైంది. 3నెలలపాటు సందడిగా సాగే జాతరకు కరోనాను లెక్క చేయకుండా భక్తులు పోటెత్తారు. లక్షలసంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. బోనాలు,  శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలతో మల్లన్న జాతర కన్నుల పండువగా ప్రారంభం కానుంది.

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలులోని మల్లన్న ఆలయం ప్రకృతి రమణీయత, అద్భుత శిల్పసంపదతో సువిశాల ప్రాంగణంలో వందల ఏళ్ల క్రితం ఆలయం నిర్మితమైంది. ప్రతి ఏడాది సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా మల్లన్నకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని.. భక్తులు ఎలాంటి పడకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు.

https://dd0ecfc7e28cdc4036bb1c72f2c04ea1.safeframe.googlesyndication.com/safeframe/1-0-37/html/container.html ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ నెల 14న బండ్లు తిప్పుడు, 16న మహాసంప్రోక్ష సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 13న ఉగాదితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కరోనా దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. క్యూలైన్లలో థర్మల్ స్క్రీనింగ్ చేసి… శానిటైజర్, మాస్క్ పంపిణీ చేస్తామని ఈవో తెలిపారు. కరోనా‌ నిబంధనలు పాటి‌స్తూ భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.

- Advertisement -

Latest news

Related news

వైరల్ అవుతున్న​ ఎలన్‌ మస్క్‌ చాలెంజ్‌

పెరిగిన జనాభా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల లాభమేమోగానీ నష్టమే ఎక్కువ ఉందని అర్థమవుతుంది. పచ్చగా ఉండాల్సిన భూమిపై జీవం ఎండిపోతుంది. వాతావరణంలో ఎన్నెన్నో మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం మన ఎన్విరాన్‌మెంట్‌కు ఉన్న...

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...